చైనాకు రోగం.. ప్రపంచం బెంభేలు!
China's disease.. the world panics!
హెచ్ఎంపీవీతో ప్రపంచం గజగజ
రోగుల వివరాలను బయటపెట్టని చైనా
2001లో వైరస్ గుర్తింపు
వ్యాక్సిన్స్, మందులు అందుబాటులో లేవు
సాధారణ చికిత్సలే
లక్షణాలున్న వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి
డబ్ల్యూహెచ్ వో, భారత ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: చైనాకు రోగమొచ్చింది.. ప్రపంచం మరోసారి బెంభేలెత్తిపోతుంది. హెచ్ ఎంపీవీ (హ్యూమన్ మెటాఫ్న్యూ మో వైరస్) చైనాలో విజృంభిస్తూ పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వ్యాధి అంటు వ్యాధి కావడంతో డబ్ల్యూహెచ్ వో, భారతవైద్య శాఖ అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్ కొత్తది కాకపోయినా చైనాలో భారీ ఎత్తున విజృంభిస్తుండడంతో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పలు దేశాలు చైనా నుంచి వస్తున్న వారి ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించిన తరువాతే తమ దేశంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఇంకోవైపు చైనా ఇది మామూలు ఫ్లూ, జ్వరమేనని అంటోంది. ఎంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారనే విషయాన్ని భయటపెట్టడం లేదు.
హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (హెచ్ఎంపీవీ) వైరస్ కొత్తదేం కాదు. దీన్ని డచ్ శాస్ర్తవేత్తు 2001లోనే గుర్తించారు. అప్పటి నుంచి ఈ వైరస్ పై పలు రకాల పరిశోధనలు చేపట్టి పలు విషయాలను కనుగొన్నారు. ఈ వ్యాధికి మందును ఇంకా కనిపెట్టలేదు. అంటే నిర్దిష్ఠ చికిత్స అనేది లేదన్నమాట. అదే సమయంలో ఈ వైరస్ ద్వారా వచ్చే ఫ్లూ, జ్వరం, శ్వాసకోశ సమస్యలు మాత్రం తగ్గించవచ్చని, ఇదొక అంటు వ్యాధిగా గుర్తించారు. దీంతో ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండడమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి ద్వారా యేటా చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (చైనా సిడిసి), డచ్ శాస్త్రవేత్తల ప్రకారం యేటా 10 వేల మందికి పైగా మరణిస్తున్నారని వెల్లడించారు. ఈ అంటు వ్యాధి కారణంగా 2018లో అత్యధిక మరణాలు 11,300 నమోదయ్యాయి. చలితీవ్రతలో ఈ వైరస్ ఎక్కువగా అటాక్ చేస్తుందని శాస్ర్తవేత్తలు గుర్తించారు.
కరోనా మహమ్మారికి కూడా చైనా వూహాన్ ప్రాంతం నుంచే సోకినట్లు తేలింది. అయినా ఈ వైరస్ పై చైనా ప్రపంచదేశాలకు వివరాలు అందించకుండా ప్రమాదంలోకి నెడుతుందనే ఆందోళన నెలకొంది. దీంతో చైనా నుంచి రాకపోకలు కొనసాగుతున్న విమానాలపై అన్ని దేశాలు ఒక దృష్టి వేసి ఉంచాయి. వచ్చిన వారిని నేరుగా ఐసోలేషన్ కు తరలించి వ్యాధి లేదని నిర్ధరించుకున్నాకే తమ దేశంలోకి ఎంట్రీ ఇస్తామని స్పష్టం చేశారు.
ఈ వ్యాధి బారి నుంచి రక్షణ పొందేందుకు ఎక్కువగా సమూహాల్లో ఉండవద్దని ఒకవేళ వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించాలని, మాస్క్, శానిటైజర్ వినియోగించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాధి లక్షణాలున్న వారి నుంచి దూరంగా ఉండాలని వైద్యులు వెల్లడించారు. ఈ వ్యాధి రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిపైనే ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది.