స్వాముల వాహనం బోల్తా.. డ్రైవర్​ మృతి

Swamula's vehicle overturned. Driver killed

Jan 3, 2025 - 13:36
 0
స్వాముల వాహనం బోల్తా.. డ్రైవర్​ మృతి

కేంద్రమంత్రి బండి సంజయ్​ చొరవతో సురక్షితంగా భక్తులు
ధన్యవాదాలు తెలిపిన పాతబస్తీవాసులు

నా తెలంగాణ, హైదరాబాద్​: భాగ్యనగరం పాతబస్తీ మాదన్నపేట ఉప్పర్​ గూడ నుంచి శబరిమల అయ్యప్పస్వామి వారి దర్శనానికి వెళ్లి భక్తుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్​ రాజు మృతి చెందగా, బస్సులో ప్రయాణిస్తున్న స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయాన్ని గురుస్వామి రాంపాల్​ యాదవ్​ మీడియాకు వివరాలందించారు. బస్సు పంపానదికి 5 కిలోమీటర్ల దూరంలోని ఘాట్​ రోడ్డులో వేగ నియంత్రణ కోల్పోయిందన్నారు. ఒక్కసారిగా బస్సు అదుపుతప్పి చెట్లపై బోల్తా పడిందన్నారు. 22మంది భక్తులకు స్వల్ప గాయాలయ్యాయని  తెలిపారు. 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ కి కృతజ్ఞతలు..

స్వాముల బస్సు ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ స్థానిక అధికారులతో మాట్లాడారని వివరించారు. ఆయన చొరవ వల్ల కొట్టాయం మెడికల్​ కాలేజీలో స్వల్ప చికిత్స తీసుకొని ప్రత్యేక దర్శనం కూడా శీఘ్రంగానే లభించిందన్నారు. తమకు ప్రత్యేక వాహన సౌకర్యం ఉచితంగానే కల్పించి తిరిగి నగరానికి సురక్షితంగా చేర్చే ఏర్పాటు చేశారన్నారు. ప్రమాద విషయం తెలుసుకొని కష్టాల్లో ఆపన్న హస్తం అందించిన కేంద్రమంత్రి బండి సంజయ్​ కు తాము రుణపడి ఉంటామని గురుస్వామి రాంపాల్​ యాదవ్​ కృతజ్ఞతలు తెలిపారు.