ప్రశాంత్ కిషోర్ నిరసనలపై ఆగ్రహం
Prashant Kishore's anger over the protests
విద్యార్థినీలతో జన సమీకరణ
బీపీఎస్ సీ ఆందోళన
పాట్నా: బీపీఎస్ సీ పరీక్షలను మళ్లీ నిర్వహించాలని పరీక్షల్లో పాల్గొనని, పోలీసు వ్రాత పరీక్షకు సిద్ధమవుతున్న వారిని ప్రశాంత్ కిషోర్ ఆందోళనల్లో పాల్గొనేలా చేశారు. శుక్రవారం పరీక్షలు నిర్వహించాలనే డిమాండ్ తో సీఎం హౌస్ ను చుట్టుముట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద యెత్తున విద్యార్థినులు తరలివచ్చి నినాదాలు, ఆందోళనలు చేశారు. ఓ అరగంట తరువాత వారంతా అక్కడి నుంచి పయనమయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థినులు స్పందించారు. ప్రశాంత్ కిషోర్, ఇతర పార్టీల నేతలు తమను ఓ పది నిమిషాలపాటు వచ్చి ఆందోళనలో కూర్చోవాలని కోరారన్నారు. తాము బీపీఎస్ సీ పరీక్షలు రాశామని కొందరు, రాయలేదని మరికొందరు, రాయబోతున్నామని కొందరు విద్యార్థినీలు వివరించారు. మరికొందరైతే ప్రశాంత్ కిషోర్ ఎవరో తెలియదని తోటి విద్యార్థులు ఆందోళనకు వెళుతుంటే తాము వచ్చామన్నారు. దీంతో విద్యార్థినులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రశాంత్ కిషోర్ ఆందోళనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన సందర్భంగా పలు రైళ్ల రాకపోకలకు ఆటంకాలు ఎదురయ్యాయి. జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు, సీఎం ఇంటివద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేసి చెదరగొట్టారు.