పోర్‌బందర్‌లో కూలిన హెలికాప్టర్​ ముగ్గురు మృతి

Three killed in helicopter crash in Porbandar

Jan 5, 2025 - 13:24
 0
పోర్‌బందర్‌లో కూలిన హెలికాప్టర్​ ముగ్గురు మృతి

గాంధీనగర్​: పోర్‌బందర్‌ కోస్ట్​ గార్డ్​ హెలికాప్టర్​ ప్రమాదానికి గురైంది. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. కొంతమందికి గాయాలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం ఈ హెలికాప్టర్​ సాంకేతిక కారణాల వల్ల కుప్పకూలిపోయిందని భావిస్తున్నారు. కోస్ట్​ గార్డ్​ ఎయిర్​ ఎన్​ క్లేవ్​ వద్ద ప్రమాదం జరిగింది. గాయపడ్డవారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.

2024 సెప్టెంబర్​ 2న కూడా ఇండియన్​ కోస్ట్​ గార్డ్​ ఐసీజీకి అడ్వాన్స్​ డ్​ లైట్​ హెలికాప్టర్​ ధృవ్​ పోర్​ బందర్​ తీరానికి సమీపంలో అరేబియాలో కూలిపోయింది. ముగ్గురు అచూకీ లభించకపోగా, ఒకరిని అధికారులు రక్షించారు. హెలికాప్టర్​ కూలిపోవడానికి గల పూర్తి కారణాలు అధికారులు వెల్లడించలేదు. ప్రస్తుతం రెస్క్యూ చర్యలు, దర్యాప్తు చేపట్టారు.