ఇస్రో మరో ఘనత అంతరిక్షంలో మొలకెత్తిన విత్తనం
Another achievement of ISRO is the seed that germinated in space
శ్రీహరికోట: అంతరిక్ష రంగంలో ఇస్రోకు సాటి లేదని మరోమారు నిరూపితమైంది. డిసెంబర్ 30న పీఎస్ ఎల్ వీ సీ–60 ద్వారా స్పెడెక్స్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాలలోని విత్తనాలు మొలకెత్తాయి. ఇస్రో శనివారం సామాజిక మాధ్యమం వేదికగా ప్రకటన, చిత్రాన్ని విడుదల చేసింది. ఎనిమిది విత్తనాలను అంతరిక్షంలోకి పంపామని, ఇందులో విత్తనాలు మొలకెత్తుందుకు ఎరువుగా ఆవుపేడను వాడినట్లు తెలిపింది. త్వరలోనే ఆకులు కూడా వస్తాయని ప్రకటించింది. ప్రస్తుతం ఇస్రో విడుదల చేసిన చిత్రాల ద్వారా విత్తనాలు మొలకెత్తుతున్నాయని వివరించింది. ఈ ప్రయోగం ద్వారా తక్కువ గురుత్వాకర్షణలో మొక్కల పెరుగుదలను పూర్తిగా అర్థం చేసుకుంటామన్నారు. తమ ఈ ప్రయత్నం అంతరిక్ష యాత్రలకు మరింత సహకారం అందిస్తుందని ఇస్రో ప్రకటించింది. దీంతో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసిన ‘కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్’ ప్రయోగం మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలను అధ్యయనం చేసే దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. భవిష్యత్తులో ఇదే పద్ధతిలో పంటల సాకుకూడా చేపట్టే ప్రయోగాలకు ఇస్రో తెరతీయనుంది.