ఆప్​ పాలన విపత్తే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Jan 5, 2025 - 14:40
 0
ఆప్​ పాలన విపత్తే

ఉజ్వల భవిష్యత్తు బీజేపీతోనే సాధ్యం
సీఎం కేజ్రీవాల్​ కు శీష్​ మహల్​
నిరుపేదలకు గృహాలు ఇవ్వరా?
ఢిల్లీని దోచుకుతిన్న ఆప్​, అడుగడుగునా అవినీతే

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ ఉజ్వల భవిష్యత్తు, కేవలం బీజేపీతోనే సాధ్యమని, ఆప్​ పాలన గతపదేళ్లలో విపత్తు కంటే తక్కువేం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆప్​ పార్టీ అవినీతికి సీఎం శీష్​ మహలే ఒక ఉదాహరణ అని ప్రధాని ఆరోపించారు. ఢిల్లీలో రూ. 12, 200 కోట్ల అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. అనంతరం 13 కి.మీ. మేర రైలులో ప్రయాణించారు. అనంతరం రోహిణి పార్క్​ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. 

ఢిల్లీలోని పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకి సంబంధించిన అన్ని పెద్ద ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వమే చేపట్టందన్నారు. రానున్న 25 యేళ్లు ఢిల్లీ అత్యంత కీలకమన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ అవతరిస్తుందన్నారు. ఢిల్లీ ప్రలు ఆప్​ తో విసిగిపోయారన్నారు. ఆప్​ నుంచి విముక్తి చేయాలని అభ్యర్థిస్తున్నారని విమర్శించారు. ఆప్​ పార్టీకి ఢిల్లీ అభివృద్ధి విజనే లేదన్నారు. ఢిల్లీలో నివసించే నిరుపేదలు స్వాభిమానంతో జీవించేలా పీఎం గృహాలను కేటాయించామన్నారు. నేడు యశోభూమి, భారత మండపాలను చూసి ఢిల్లీ గర్విస్తుందన్నారు. ఢిల్లీలో గుంతలు, మురికినీరు, అపరిశుభ్రత, ట్రాఫిక్​,పార్కింగ్​ విషయంలో గొడవలు, వ్యాపారస్థులతో వసూళ్లలో ఆప్​ నేతలు మునిగిపోయారన్నారు. ఇక ఏకంగా సీఎం మాత్రం శీష్​ మహల్​ అవినీతికి ఒక ఉదాహరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఢిల్లీకి పదేళ్లు కలుషిత గాలి పీల్చుకుఏలా చేశారని మండిపడ్డారు. ఆప్​ పార్టీ పాఠశాలలు, రాజకీయాలు, మద్యం, వైద్యం, కేంద్ర పథకాలను కూడా దోచుకుతిని నిరుపేదల పొట్టకొడుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. ఢిల్లీ ప్రభుత్వం కేవలం కాగితాలపైనే పనిచేసిందని ఏనాడూ ప్రజల బాగోగులు పట్టించుకోలేదని, ప్రజలు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఆప్​ ను తరిమికొట్టి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీ కోరారు.