బ్రూనై, సింగపూర్ పర్యటనకు ప్రధాని మోదీ
Prime Minister Modi to visit Brunei and Singapore
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం బ్రూనై, సింగపూర్ ల మూడు రోజుల పర్యటన నిమిత్తం బయలుదేరారు. రెండు దేశాలతో ఆసియా ప్రాంతంలోని భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించనున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో పసిఫిక్ విజన్ లో రెండు దేశాలు భారత్ కు అతి ముఖ్యమైన భాగస్వాములుగా నిలుస్తాయని మోదీ ఆకాంక్షించారు. ఈ పర్యటనలో బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా, ఇతర రాజకుటుంబీకులతో కలిసి సమావేశం నిర్వహించనున్నారు. అటు పిమ్మట సింగపూర్ వెళ్లనున్నారు. అక్కడ రాష్ర్టపతి థర్మన్ షణ్ముగరత్నం, ప్రధాని లారెన్స్ వాంగ్, మంత్రి లీ సీన్ లూంగ్ తదితరులతో కలిసి ద్వైపాక్షిక బంధాలపై చర్చించనున్నారు.
ఉత్పత్తి, తయారీ, డిజిటలైజేషన్, సుస్థిరాభివృద్ధి, రక్షణ వంటి రంగాలపై కీలక చర్చలు నిర్వహించనున్నారు.