పారా ఒలింపిక్స్ విజేతలకు మోదీ శుభాకాంక్షలు
Modi congratulates the Paralympics winners
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: భారత పారా ఒలింపిక్స్ విజేతలు మోనా అగర్వాల్, ప్రీతిపాల్,మనీష్ నర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఫోన్ లో మాట్లాడారు. పతకాలు సాధించిన కృషిని కొనియాడారు. దేశం గర్వించే రీతిలో మెరుగైన ప్రదర్శనను కొనసాగించారని అభినందించారు. అదేసమయంలో అవని లేఖరా రాబోయే పోటీల్లో మెరుగైన ప్రదర్శనను కనబరుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
పారా ఒలింపిక్స్ లో ఇప్పటివరకు ఐదు పతకాలు సాధించగా అవని లేఖరా బంగారు పతకం, మోనా కాంస్యం, మనీష్ నర్వాల్ రతం, ప్రీతిపాల్ కాంస్యం, రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. భారత్ నుంచి రెండు పతకాలు సాధించిన లిస్టులో అవ్నీ చేరింది. ఈమె 10మీటర్ల ఎయిర్ రైఫిల్ లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం సాధించింది.