ఆసియా మహిళా హాకీలో భారత్​ విజయఢంకా

India triumphed in Asian women's hockey

Nov 20, 2024 - 20:16
 0
ఆసియా మహిళా హాకీలో భారత్​ విజయఢంకా

ముచ్చటగా మూడోసారి ట్రోఫీ కైవసం
1–0 తేడాతో డ్రాగన్​ ఓటమి
జై శ్రీరామ్​ నినాదాలతో మార్మోగిన స్టేడియం

పాట్నా: మహిళల ఆసియా హాఈ ఛాంపియ్​ షిప్​ లో డ్రాగన్​ ను భారత్​ మట్టి కరిపించింది. బుధవారం సాయంత్రం బిహార్​ రాజ్​ గిర్​లో జరిగిన ఈ మ్యాచ్​ లో 1–0 తేడాతో చైనాను ఓడించింది. మ్యాచ్​ ప్రారంభమయ్యాక 31వ నిమిషంలో దీపిక బృందం తొలి గోల్​ ను చేసింది. తొలి, రెండో క్వార్టర్స్​ లో ఇరు జట్లు ఎలాంటి గోల్స్​ సాధించలేకపోయాయి. రెండో క్వార్టర్​ లో భారత్​ 4, చైనాకు 2 పెనాల్టీ కార్నల్​ లు లభించాయి. రెండు జట్లు కూడా పెనాల్టీ కార్నర్​ లను సద్వినియోగం చేసుకోలేకపోయాయి. రెండో క్వార్టర్​ మొదలైన మరు నిమిషంలోనే భారత్​ గోల్​ సాధించింది. దీంతో స్టేడియం అంతా జై శ్రీరామ్​ నినాదాలతో మారుమ్రోగిపోయింది.
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ వరుసగా రెండోసారి, మొత్తంగా చూసుకుంటే మూడోసారి ట్రోఫీని గెలుచుకుంది. అంతకుముందు 2023లో రాంచీలో, 2016లో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్​ కైవసం చేసుకుంది. 
గ్రూప్​ మ్యాచ్​ లు..
11 నవంబర్​ మలేషియాను 4–0తేడాతో భారత్​ ఓడించింది.
12 నవంబర్​ సౌత్​ కొరియా 3–2 తేడాతో ఓడించింది.
14 నవంబర్​ థాయ్​ లాండ్​ ను 13–0తో ఓడించింది.
16 నవంబర్​ చైనాను 3–0తో ఓడించింది.
17 నవంబర్​ జపాన్​ ను 3–0తేడాతో ఓడించింది.
సెమీఫైనల్​..
19 నవంబర్​ జపాన్​ ను 2–0 తేడాతో ఓడించింది.
ఫైనల్​..
20 నవంబర్​..
చైనాను 1–0తేడాతో భారత్​ పరాజయం పాలు చేసింది.