మాజీ రాష్ట్రపతి నారాయణన్ కు రాష్ట్రపతి నివాళులు
President pays tribute to former President Narayanan
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ నివాళులర్పించారు. నారాయణన్ పదో రాష్ట్రపతి, 1997 నుంచి 2002 వరకు పదవిలో ఉన్నారు. 1992 నుంచి 1997 వరకు తొమ్మిదో ఉపరాష్ట్రపతిగా కొనసాగారు. భారత్ తరఫున మాజీ దౌత్యవేత్తగా కూడా పనిచేశారు. యూఎస్, చైనాలకు భారత్ తరఫున రాయబారిగా పని చేశారు.