వివాదాలకు తావిచ్చే ప్రసంగాలొద్దు

అగ్నివీర్​, డిఫెన్స్​ లపై రాజకీయాలొద్దు బీజేపీ, కాంగ్రెస్​ జాతీయాధ్యక్షులకు ఎన్నికల సంఘం నోటీసులు

May 22, 2024 - 16:12
 0
వివాదాలకు తావిచ్చే ప్రసంగాలొద్దు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: వివాదాలకు తావిచ్చే ఎలాంటి ప్రకటనలు,ప్రసంగాలనైనా చేయవద్దని ఎన్నికల సంఘం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్​ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖార్గేలకు బుధవారం నోటీసులు జారీ చేసింది. మతపరమైన ప్రకటనలు, రాజ్యాంగంపై తప్పుడు మాటలు, అదే సమయంలో సైన్యం (అగ్నివీర్​)లపై అనుచిత వ్యాఖ్యలను చేయవద్దని ఆదేశించింది. ఆయా విషయాలపై తమ పార్టీల నాయకులకు కూడా తెలియజేయాలని స్పష్టం చేసింది. అదే సమయంలో ఏ వ్యక్తి గౌరవ మర్యాదలను కూడా కించపరిచే వ్యాఖ్యలు చేయరాదని పేర్కొంది. అగ్నివీర్​, డిఫెన్స్​ ఫోర్స్​ లను రాజకీయాలకు వాడుకోవద్దని సూచించింది. ఎన్నికల ప్రచారం తారస్థాయికి చేరుకోవడంతో తొలుత నుంచి అన్ని పార్టీలు మత, కుల, సైనిక శక్తులపై పలుమార్లు ఆరోపణలు,ప్రత్యారోపణలు, అనుచిత వ్యాఖ్యలు తమ దృష్టికి వచ్చాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నోటీసులను జారీ చేసినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.