50 విమానాలకు బాంబు బెదిరింపులు
Bomb threats to 50 planes
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: దేశంలో విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆదివారం ఒకేసారి 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇండిగోకు చెందిన 18, విస్తారా 17, అకాసా 5 విమానాలకు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపులన్నీ నకిలీవేనని గుర్తించారు.
14 రోజుల్లో 350 విమానాలకు బెదిరింపులు
20 అక్టోబర్ 25కు పైగా విమానాలకు
19 అక్టోబర్ 30కి పైగా విమానాలకు
18 అక్టోబర్ 2
17 అక్టోబర్ 1
16 అక్టోబర్ 5
15 అక్టోబర్ 7
14 అక్టోబర్ 3
మంత్రి రామ్మోహన్ నాయుడు..
బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులు, విమానాల సురక్షిత భద్రతల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకోసం చట్టాలను సవరించే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. బెదిరింపులకు పాల్పడేవారిపై ఇక కఠిన చర్యలు తప్పవన్నారు. చర్యలతోపాటు జరిమానాలు కూడా భారీ మొత్తంలో ఉంటాయన్నారు. త్వరలోనే బెదిరింపులకు పాల్పడినవారందరినీ నో ఫ్లై లిస్ట్ లో చేరుస్తామని తెలిపారు.