ల్యాండ్​ ఫర్​ జాబ్​ కేసు.. లాలూతోపాటు 78మందిపై చార్జీషీట్​ దాఖలు

జూలై 6న విచారణ

Jun 7, 2024 - 17:49
 0
ల్యాండ్​ ఫర్​ జాబ్​ కేసు.. లాలూతోపాటు 78మందిపై చార్జీషీట్​ దాఖలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ల్యాండ్​ ఫర్​ జాబ్​ కేసులో సీబీఐ తుది చార్జీషీట్​ ను ఢిల్లీలోని రౌస్​ అవెన్యూ కోర్టుకు శుక్రవారం దాఖలు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 6న విచారించనుంది. సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్​ లో లాలూ యాదవ్​ తోపాటు 78 మంది పేర్లు ఉన్నాయి. గతంలో రెండుసార్లు చార్జీషీట్​ దాఖలుపై సీబీఐని కోర్టు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులుగా 38 మంది ఉన్నారని, వీరితోపాటు మరికొంతమంది అధికారులు వీరికి పూర్తిగా సహకరించారని సీబీఐ పేర్కొంది. లాలూ ప్రసాద్​ యాదవ్​ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు పలువురితో భూములు సొంతం చేసుకొని రైల్వేలో ఉద్యోగాలు కల్పించారనే ఆరోపణలున్నాయి. రైల్వే నియమ నిబంధనలు పట్టించుకోకుండా మార్గదర్శకాలకు తిలోదకాలిస్తూ ఉద్యోగాలు కల్పించడాన్ని పలువురు ఫిర్యాదు చేయడంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది.