ఖర్గేకు కేంద్ర మంత్రి గడ్కరీ లీగల్ నోటీసులు
Nitin Gadkari issues legal notice to Mallikarjun Kharge & Jairam Ramesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత జైరామ్ రమేష్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లీగల్ నోటీసులు జారీ చేశారు. తప్పుదోవ పట్టించే వీడియోలు, కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు వారు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచే ఈ పోస్ట్‌లు బయటకు రావడాన్ని చూసి తాను ఆశ్చర్యపోయినట్లు గడ్కరీ పేర్కొన్నారు. కాంగ్రెస్ తన ఇంటర్వ్యూను తారుమారు చేసి, తప్పుగా ఎడిట్ చేసిన 19 సెకెండ్ల వీడియోను అప్‌లోడ్ చేసిందని, తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని ఆయన వారికి ఇచ్చిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు.