పండ్ల మొక్కల ఉత్పత్తి అభినందనీయం
బీజేపీ ఎంపీ రఘునందన్ రావు
నా తెలంగాణ, సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బీజేపీ మెదక్ ఎంపీ మంగళవారం పర్యటించారు. పట్టణంలోని గంగా నర్సరీని సందర్శించి వివిధ రకాల పండ్ల మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫల పరిశోధనలో మాదిరిగానే గంగా నర్సరీలో వంద రకాల మొక్కలను ఉత్పత్తి చేయడం అభినందనీయమన్నారు. వివిధ రకాల మొక్కలను ఉత్పత్తి చేసి బయటి రాష్ట్రాలకు ఎగుమతులు చేయడం సంతోషమన్నారు. మెతుకులు పంచే ఒకప్పుడు మెతుకు సీమగా ఉండే మెదక్ జిల్లాలో మామిడి, జామ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడ ఇలాంటి మొక్కలను ఉత్పత్తి చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే సరసమైన ధరలకు అందిస్తూ వ్యవసాయం చేసుకునే రైతులకు ఉపయోగపడేలా నర్సరీని రూపొందించడం పట్ల గంగమోహన్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. అనంతరం గంగా నర్సరీ ఎండి చైర్మన్ గంగా మోహన్ ఎంపీ రఘునందన్ రావు శాలువాతో సన్మానించారు.