రామన్నపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

డీసీసీబీ డైరెక్టర్ల హెచ్చరిక

Aug 29, 2024 - 17:30
 0
రామన్నపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి

నా తెలంగాణ, ఆదిలాబాద్: ఋణమాఫీ ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు రాబందుళ్ల మాట్లాడటం ఏంటని? అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న మాజీ మంత్రి జోగురామన్నపై వ్యక్తి గత ఆరోపణలు సరికావని డీసీసీబీ డైరెక్టర్​ పరమేశ్వర్​, పురుషోత్తంలు అన్నారు. గురువారం పట్టణంలోని బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్​ అడ్డి భోజారెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 

70శాతం మందికి ఋణమాఫీ కాలేదన్నారు. వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు అండగా నిలబడిన మాజీ మంత్రిపై దూషణలు సరికాదన్నారు. ఇకనైనా అనవసర ఆరోపణలు మానుకోవాలన్నారు. అన్నదాతలకు బీఆర్​ఎస్​ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో  డీసీసీబీ డైరెక్టర్లు పరమేశ్వర్, పురుషోత్తం, నాయకులు, కొమ్ర రాజు, నవాతే శ్రీనివాస్, తమల సతీష్, జవ్వాజి దయానంద్, తదితరులు పాల్గొన్నారు.