ఆకాశ్​ కు జాతీయ కో ఆర్డినేటర్​ గా బాధ్యతలు

మనసు మార్చుకున్న మాయావతి

Jun 23, 2024 - 16:51
 0
ఆకాశ్​ కు జాతీయ కో ఆర్డినేటర్​ గా బాధ్యతలు

లక్నో: ఎంపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మేనల్లుడు ఆకాశ్​ ఆనంద్​ ను రాజకీయ వారసుడిగా ప్రకటించారు. బీఎస్పీజాతీయ కో ఆర్డినేటర్​ బాధ్యతలను అప్పగించారు. ఆదివారం ఉదయం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆకాశ్​ కు బాధ్యతలను అప్పజెబుతున్నట్లు మాయావతి స్పష్టం చేశారు. సరిగ్గా 42 రోజుల క్రితం ఆకాశ్​ కు ఇంకా రాజకీయ పరిణితి అవసరమని మాయావతి ప్రకటించారు. అనంతరం ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. దీంతో మాయావతి తన మనసు మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో ఆకాశ్​ ఇక నుంచి క్రియాశీలక బాధ్యతలను నిర్వర్తించనున్నారు.