‘తీలేవాలీ’ మసీదుపై విచారణ కొనసాగుతుందన్న కోర్టు
లక్నోలోని దేవాలయాన్ని కూలగొట్టి తీలేవాలి మసీదు నిర్మించారన్న పిటిషన్ను విచారించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
లక్నో: లక్నోలోని దేవాలయాన్ని కూలగొట్టి తీలేవాలి మసీదు నిర్మించారన్న పిటిషన్ను విచారించనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో ముస్లింల పక్షాన కేసు కొట్టివేయాలని వేసిన పిటిషన్ను తిరస్కరించింది. హిందూ పక్షానికి అనుకూలంగా తీర్పు రావడంతో సంతోషం వ్యక్తమవుతోంది. మసీదు కింద లక్ష్మణుడి ఆలయం ఉందని దీన్ని లక్ష్మణ్ తిలా అని అంటారని ‘శేషనాగేష్ తిలేశ్వర్ మహాదేవ్ విరాజ్‌మాన్’ తరఫున లక్నో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఔరంగజేబు దీన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని పిటిషన్ లో పేర్కొన్నారు.