గోవింద గన్​ మిస్​ ఫైర్

​ అభిమానుల ఆశీస్సులతో సురక్షితంగానే ఉన్నా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు డీసీపీ దీక్షిత్​ కాలిలో బుల్లెట్​ తొలగించిన వైద్యులు

Oct 1, 2024 - 13:23
 0
గోవింద గన్​ మిస్​ ఫైర్

ముంబాయి: ప్రముఖ బాలీవుడ్​ నటుడు గోవింద పిస్టోల్​ మిస్​ ఫైర్​ అయ్యింది. దీంతో అతని కాలికి తీవ్ర గాయమైంది. మంగళవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయలుదేరేముందు లైసెన్స్​ డ్​ రివాల్వర్​ ను శుభ్రం చేస్తుండగా మిస్​ ఫైర్​ అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు ముంబాయిలోని కృతికేర్​ ఆసుపత్రికి తరలిచారు. విషయం తెలుసుకున్న డీసీపీ దీక్షిత్​ తన టీమ్​ తో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. నటుడి రివాల్వర్​ ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గోవింద ఆసుపత్రిలో చికిత్సపొందుతుండడం వల్ల ఆసుపత్రి వద్ద పెద్ద యెత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. బుల్లెట్​ పేలిన ఘటనలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదన్నారు. 

 వైద్యులు ఆయన కాలిలో ఉన్న బుల్లెట్​ ను తొలగించి ప్రాణాపాయం లేదని తెలిపారు. తల్లిదండ్రులు, అభిమానుల ఆశీస్సులతో తాను బాగానే ఉన్నానని గోవింద ఆసుపత్రి నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. కాలిలో ఉన్న బుల్లెట్​ ను వైద్యులు తొలగించారని తెలిపారు. అభిమానుల ప్రార్థనలు, వైద్యుల చికిత్స వల్లే తాను ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని గోవింద ధన్యవాదాలు తెలిపారు. 

ఆసుపత్రిలో గోవిందతోపాటు ఆయన కూతురు టీనా (నర్మద) ఉన్నారు. భార్య సునీతా కోల్​ కతాలో ఉన్నారు. ఉదయం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోల్​ కతాకు బయలుదేరే ముందే ఈ ప్రమాదం చోటు చేసుకుంది.