గాజాలో ఐడీఎఫ్ భారీ దాడులు 70మంది మృతి
వందలాది మందికి గాయాలు
ఖాన్ యూనిస్/జేరూసలెం: గాజాలోని ఖాన్ యూనిస్ పై మరోమారు ఐడీఎఫ్ భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 70మంది వరకు పాలస్తీనియన్లు మృతి చెందారు. హమాస్ కూడా ఇజ్రాయెల్ పై రాకెట్ల దాడులను కొనసాగిస్తుంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉండగా ఈ దాడి జరగడం గమనార్హం. దాడుల్లో వందలాది మంది గాయపడ్డారు, వెంటనే వారిని చికిత్స కోసం నాసిర్ ఆసుపత్రికి తరలించినట్లు గాజాలోని అధికార వర్గాలు వెల్లడించాయి. ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని విడిచి వెళుతున్న వారిపై ఐడీఎఫ్ దాడికి పాల్పడ్డారని అధికారులు ఆరోపించారు.
మరోవైపు ఇజ్రాయెల్ పై హమాస్ కూడా దాడులకు పాల్పడుతోంది. ఈ దాడుల్లో నష్టం వివరాలు బయటికి రాలేదు.