ఎంహెచ్–370 సెర్చ్ కు రెఢీ
MH-370 search for America Company
అమెరికా సంస్థ ప్రతిపాదనకు మలేషియా ఓకే
చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెర్చ్ ఆపరేషన్
అయినా ఆచూకీ లభించని విమానం
నేటికి లభించని 239 మంది ప్రయాణికుల ఆచూకీ
గల్లంతైన వారిలో ఐదుగురు భారతీయులు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: పదేళ్ల క్రితం అదృశ్యమైన ఎంహెచ్–370 మలేషియా విమానం సెర్చ్ ఆపరేషన్ ను నిర్వహించాలని అమెరికా కంపెనీ భావించింది. ఇందుకు మలేషియా ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. 2014 మార్చి 8న మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎం హెచ్ 370 బోయింగ్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే రాడార్ తో సంబంధాలను కోల్పోయింది. ఈ విమానంలో ప్రయాణీకుల విమానం అదృశ్యమైంది. విమానంలో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది మొత్తం 239 మంది ఆచూకీ నేటి వరకూ లభ్యం కాలేదు. ఈ విమానం మలేషియా రాజధాని కౌలలంపూర్ నుంచి బీజింగ్ కు వెళుతుండగా అదృశ్యమైంది. విమాన ప్రమాదాల చరిత్రలో 370 మిస్సింగ్ తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విమానానికి సంబంధించిన ఏ ఒక్క ఆనవాలు ఇంతవరకూ లభించలేదు. విమాన అదృశ్యం ప్రపంచ సాంకేతికతకు సవాల్ విసిరినట్లయ్యింది.
అమెరికా కంపెనీ ‘నో ఫైండ్, నో ఫీజ్’ ఈ ప్రతిపాదనను తీసుకువచ్చింది. ఇందుకు మలేషియా ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దక్షిణ మహాసాగరంలో విమానం కూలిపోయిందని భావిస్తున్నారు. 15వేల కిలోమీటర్ల అన్వేషణకు ఈ సంస్థ ముందుకు వచ్చింది. ఈ విమానంలో అత్యధికంగా 153 మంది చైనా ప్రయాణికులుండగా, భారత్ కు చెందిన ఐదుగురు ప్రయాణికులున్నారు. విమానం అదృశ్యం తరువాత అనేక ప్రయత్నాలు చేసినా దీని ఆచూకీ లభించలేదు. చరిత్రలోనే ఎంహెచ్ 370 ఆచూకీ కనుగొనేందుకు అత్యంత ఎక్కువ ఖర్చు చేసినా ఫలితం లభించలేదు. విమాన అదృశ్యంపై పైలెట్, కోపైలెట్ల హస్తంపై కూడా పలు అనుమానాలున్నాయి. కానీ ఏవీ రూఢీ కాలేదు.