విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలి
పాఠశాలలో మంత్రి సీతక్క దుస్తులు, పుస్తకాల పంపిణీ
నా తెలంగాణ, డోర్నకల్: ప్రభుత్వ బడుల్లో చదువుతూ విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదగాలని మంత్రి సీతక్క అన్నారు. ఆమె సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ రెసిడెన్షియల్ పాఠశాలను ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రునాయక్, జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి సందర్శించారు. విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుల్లో రానించాలన్నారు. జీవితంలో ఒక లక్ష్యం అంటూ ఏర్పాటు చేసుకొని ఉన్నతస్థానానికి చేరుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తున్నామని తెలిపారు. ప్రతీఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. చదువుల్లోనే గాక క్రీడల్లోనూ విద్యార్థులు రానిస్తూ గురువులు, తల్లిదండ్రులు,ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలిపారు.