కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత

తెలంగాణ సమరశీల పోరాటాల గడ్డ సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, ఎస్. వీరయ్య 

Oct 26, 2024 - 20:19
 0
కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో వ్యతిరేకత
 నా తెలంగాణ, సంగారెడ్డి: కాంగ్రెస్‌ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్యలు అన్నారు. సంగారెడ్డి లోని పీఎస్ఆర్ గార్డెన్ లో శనివారం నిర్వహించిన మహాసభల సన్నాహక  సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. 
 
కేసీఆర్‌ పట్ల ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ ప్రభుత్వం చేసిందేమీలేదన్నారు. ఏడాది పాలనలో రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు తప్ప వేటినీ అమలు చేయలేదన్నారు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారని విమర్శించారు. 
 
తెలంగాణ సమరశీల పోరాటాల గడ్డ, రాబోయేది ప్రజా పోరాటాల కాలం మహాసభల సందర్భంగా ఎర్రజెండాను ఊరూరా తీసుకెళ్తమన్నారు.  ప్రజల బతుకులు మారేందుకు జనం సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు చూపుతున్న విధానాలు ప్రత్యామ్నాయం తప్ప ఓట్లు, సీట్ల బలాబలాలు కాదని వారు పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక  విద్య, భూమి, ఉపాధి, సామాజిక న్యాయం, స్వయం పోషణ అందరికీ దక్కాలన్నదే కమ్యూనిస్టుల ప్రత్యామ్నాయ విధానమన్నారు. రాష్ట్రంలో పాలకుల తీరు ప్రజలకు మేలు చేసేది కాకుండా ముంచేలా ఉన్నదని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జే.మల్లిఖార్జున్‌, జిల్లా కార్యదర్శులు ఆముదాల మల్లారెడ్డి, ఎ.మల్లేశం,  మూడు జిల్లాల కార్యదర్శి వర్గ సభ్యులు బి.మల్లేశం, కె.రాజయ్య, బి.రామచంద్రం,  అతిమేల మాణిక్యం, ఎం.నర్సింహులు, గోపాల స్వామి, శిశిధర్‌, ఎల్లయ్య, చంద్రారెడ్డి, నర్సమ్మ, మల్లేశం, బవసరాజు, లతిల పాల్గొన్నారు.