మాజీ డీసీసీ అధ్యక్షులు మృతి
Former DCC presidents passed away
నా తెలంగాణ, నిర్మల్: ముథోల్ నియోజకవర్గ రాజకీయ కురువృద్ధుడు, మచ్చలేని రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డీసీసీ మాజీ అధ్యక్షులు మాశెట్టి వార్ దిగంబర్ శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయన హైదరాబాద్ లోని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మాశెట్టి వార్ దిగంబర్ అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు భైంసాలో జరుగనున్నాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మాశెట్టివార్ దిగంబర్ మాజీ మంత్రి గడ్డెన్నకు ప్రధాన అనుచరుడిగా కొనసాగారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులుగా దశాబ్ద కాలానికి పైగా సేవలందించారు. భైంసా ప్రాంత వాసులందరికీ సుపరిచితులైన ఆయన రాజకీయంగా, సామాజికంగా, వ్యాపార పరంగా ఎన్నో సేవలందించారు. భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, మున్సిపల్ చైర్మన్, శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలకు కోట్లాది రూపాయల విలువైన భూమిని ఉచితంగా అందించారు. వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గా కొనసాగారు. భైంసా పట్టణంలోని అన్నీ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి మెలిసి ఉండే ఆయన మృతి చెందడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.