327 జెండా ఆవిష్కరణ
327 Discovery of the flag
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: ఐఎన్టీయూసీ /టి ఎస్ ఈ యు/ 327, స్థాపించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సంజీవరెడ్డి గౌరవార్థం, 327, జెండాను శనివారం ఆవిష్కరించారు. భూపాల్ రెడ్డి, టీజీఎస్పీడీసీఎల్, కంపెనీ సెక్రటరీ ఆధ్వర్యంలో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంజీవ రెడ్డి సేవలు మరువలేని వని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. అలుపెరుగని పోరాట యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోవిందరావు, ఈశ్వరప్ప, శ్రీమతి మంజుల, జిల్లా అధ్యక్షులు వీరయ్య, సెక్రటరీ శ్రీకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్, వినోద్ కుమార్, కోశాధికారి, వెంకటేశం, జిల్లాలోని నాయకులు కార్మికులు, ఉద్యోగులు మహిళలు పాల్గొన్నారు.