భారత్ తో స్నేహహస్తానికి సౌదీతో పాక్ విన్నపాలు
భారత్ తో అనుక్షణం ఉగ్రవాదం విషం చిమ్ముతున్న పాక్ ఎట్టకేలకు సంబంధాల కోసం తహతహలాడుతోంది.
రియాద్: భారత్ తో అనుక్షణం ఉగ్రవాదం విషం చిమ్ముతున్న పాక్ ఎట్టకేలకు సంబంధాల కోసం తహతహలాడుతోంది. మంగళవారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా రాజు షరీఫ్ బిన్ సల్మాన్‌తో భేటీ అయ్యారు. కశ్మీర్ అంశంతో సహా పలు విషయాలపై పరస్పర సహకారం కోసం సహాయం చేయాలని రాజు షరీఫ్ ను అభ్యర్థించారు.అంతర్జాతీయ కశ్మీర్ సమస్యను తెరపైకి తేవాలని పాక్ చూస్తోంది. ఈ అంశాన్ని అంతర్గత విషయం భారత్ ఎన్నోమార్లు చెబుతూ కుండబద్ధలు కొడుతోంది. ఈ నేపథ్యంలో కుక్క తోక వంకరే అన్నట్లు మోదీ ప్రభుత్వం వచ్చాక తగిన రీతిలో సమాధానం చెబుతుండడంతో పాక్ కు ముచ్చెమటలు పడుతున్నాయి. మరోవైపు అంతర్గతంగా పాక్ ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. కాగా షెహబాజ్ పర్యటనలో పాక్ ప్రిన్స్ ను ఆహ్వానించడం విశేషం. ఆయన ఇరుదేశాల అంశాలపై ఏం స్పందించక పోవడం విశేషం. ఇప్పటికే కశ్మీర్ విషయంలో భారత్ అనేక చర్యలు తీసుకుంది. ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజన, ఉపా చట్టం లాంటి బలమైన నిర్ణయాలను తీసుకుంది. మరోవైపు పర్యాటక రంగంగా జమ్మూకశ్మీర్ ను తీర్చిదిద్దుతుండడంతో క్రమేణా ఆ రాష్ర్ట ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుండడాన్ని పాక్ జీర్ణించుకోలేకపోతోంది.