మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకం ఈవీఎంలపై సుప్రీం తీర్పుపై హర్షం

వ్యతిగత ప్రయోజనాల కోసమే అపఖ్యాతికి హస్తం ప్రయత్నం దశాబ్ధాల తరబడి సామాన్యుల ఓటు హక్కుకు భంగం ప్రస్తుతం స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రతీ ఒక్కరికీ అవకాశం బిహార్​ అరారియా ఎన్నికల సభలో ప్రధాని మోదీ

Apr 26, 2024 - 15:19
 0
మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకం ఈవీఎంలపై సుప్రీం తీర్పుపై హర్షం

పాట్నా: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ హక్కులను కాలరాసే కుట్రకు కాంగ్రెస్​ పాల్పడుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమన్నారు. బిహార్​ లోని అరారియాలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలకు కాంగ్రెస్​ పాల్పడుతోందని మండిపడ్డారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈవీఎంలను అపఖ్యాతి పాలు చేయడంలో బిజీగా ఉన్నదన్నారు. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రజాస్వామ్యాన్ని కాపాడే తీర్పునిచ్చిందని కొనియాడారు. 

బిహార్​ లోని ఆర్జేడీ, కాంగ్రెస్​ కూటమి పార్టీలకు అంబేద్కర్​ రాజ్యాంగం గురించి పట్టదని ఆరోపించారు. దశాబ్ధాల తరబడి సామాన్య ప్రజలను ఓటు హక్కుకు దూరం చేశారని వివరించారు. ప్రస్తుతం అందరికీ పూర్తి ఓటు హక్కు ద్వారా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసేలా చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. కాంగ్రెస్​ పార్టీ దేశ వ్యాప్తంగా కర్ణాటక మోడల్​ రిజర్వేషన్ల కుట్రకు తెరలేపుతోందన్నారు. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ముస్లింలందరినీ ఓబీసీ జాబితాలో చేర్చడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. ఓబీసీలకు ఉన్న 27 శాతం రిజర్వేషన్లలో ఇప్పుడు సింహభాగం ముస్లింలకే దక్కితే ఆ వర్గాలు ఏం కావాలని ప్రశ్నించారు.