పాక్​ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ముగ్గురి మృతి.. 20 మందికి గాయాలు

Apr 9, 2024 - 22:02
 0
పాక్​ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

ఇస్లామాబాద్​: పాక్​ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం బలూచిస్థాన్​ లో పేలుళ్లకు తెగబడ్డారు. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బలూచ్​ పోలీస్​ ఉన్నతాధికారులు వివరించారు. పేలుడులో ఐఈడీలు ఉపయోగించినట్లు తెలిపారు. మసీదు, మార్కెట్​ లే లక్ష్యంగా దాడులకు పాల్పడినట్లు తెలిపారు. రంజాన్​ మాసంలో రద్దీగా ఉన్న ప్రాంతాలనే ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని పోలీసులు వివరించారు. రిమోట్​ కంట్రోల్​ తో ఐఈడీ పేలుడుకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడుపై విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ సంతాపం, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా పేలుడుకు ఏ సంస్థ ఇప్పటివరకూ బాధ్యత వహించలేదు