ఏప్రిల్ –2024 రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రూ. 2.10 లక్షల కోట్లు
12.4 శాతం వృద్ధి నమోదు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏప్రిల్ నెలలో జీఎస్టీ రికార్డు స్థాయిలో వసూలైంది. వార్షిక ప్రాతిపదికన తీసుకుంటే 12.4 శాతం నమోదు కాగా, రూ. 2.10 లక్షల కోట్లను సాధించింది. అంతకుముందు జీఎస్టీ వసూళ్లు రూ. 1.87 లక్షల కోట్లు మాత్రమే ఉండడం గమనార్హం. 2024లో ఒకే నెలలో అత్యధిక వసూళ్లు సాధించినది ఏప్రిల్ లోనే కావడం గమనార్హం. ప్రస్తుతం కంటే 2023లో 0.23 లక్షల కోట్లను తక్కువ సాధించింది.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, ఏప్రిల్‌కు రూ. 2,10,267 కోట్ల జీఎస్టీ వసూలు చేయగా, సీజీఎస్టీ మాత్రం 43,846 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 53,538 కోట్లు. ఐజీఎస్టీ రూ. 99,623 కోట్లు, సెస్ రూ. 13,260 కోట్లు. సెస్‌లో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన రూ.1008 కోట్లు ఉన్నాయి.
రీఫండ్ ల తరువాత ఆదాయం..
జెఎస్టీ రీఫండ్ ల తరువాత ఏప్రిల్ లో నికర ఆదాయం రూ. 1.92 కోట్లుగా తేలింది. గతేడాదితో పోలీస్తే 17.1 శాతం ఎక్కువ.
జీఎస్టీ 2017లో అమలు చేశారు. జీఎస్టీ అనేది పరోక్ష పన్ను. మునుపటి పరోక్ష పన్నులు (వ్యాట్) సేవా పన్ను, కొనుగోలు పన్ను, ఎక్సైజ్ సుంకం, అనేక ఇతర పరోక్ష పన్నులను భర్తీ చేసేందుకు 2017లో జీఎస్టీని అమలు చేశారు. ఇందులో నాలుగు శ్లాబులు ఉన్నాయి.