నూతన క్రిమినల్ చట్టాల పురోగతి సమీక్షకు ప్రధాని మోదీ
PM Modi to review progress of new criminal laws
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: నూతన క్రిమినల్ చట్టాల పురోగతిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 3 (మంగళవారం) చండీగఢ్ లో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం పీఎంవో సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశ నేర న్యాయవ్యవస్థను సవరించి మరింత పటిష్టం చేసే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పాల్గొంటారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా, కొత్త చట్టాలను ప్రవేశపెట్టిన తర్వాత చట్టం అమలు, న్యాయ విధానాలు, సాక్ష్యాధారాల నిర్వహణలో మెరుగుదలను ప్రదర్శించడానికి పోలీసులు ప్రత్యక్ష ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో సెక్టార్ 12లోని పంజాబ్ ఇంజినీరింగ్ కాలేజ్ (పీఈసీ) క్యాంపస్‌లో ఎనిమిది స్టేజ్ ప్రదర్శనలు ఉంటాయి.