బీజేపీ శాసనసభా పక్ష సమావేశం పరిశీలకుల ప్రకటన

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​, మాజీ మంత్రి విజయ్​ రూపానీ

Dec 2, 2024 - 17:58
 0
బీజేపీ శాసనసభా పక్ష సమావేశం పరిశీలకుల ప్రకటన

ముంబాయి: మహారాష్ట్రలోని కీలక ఎమ్మెల్యేల సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్​ మాజీ మంత్రి విజయ్ రూపానీలను బీజేపీ నియమించింది. సోమవారం వీరి నియామకానికి సంబంధించి ప్రకటించింది. వీరి నియామకానికి పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. బీజేపీ 132, షిండే 57, పవార్​ 41 సీట్లలో విజయం సాధించారు. అయితే అజిత్​ పవార్​ వర్గం ఫడ్నవీస్​ సీఎంగా అయ్యేందుకు ఓకే చెప్పినా, షిండే వర్గమే కాస్త బెట్టు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేల ఏకాభిప్రాయ సాధనను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉత్పన్నం అయ్యింది. దీంతో అందరినీ ఏకతాటిపైకి తెచ్చే బాధ్యతను వీరిద్దరికి అప్పజెప్పింది.