కేంద్ర మంత్రుల బాధ్యతల స్వీకరణ
Acceptance of responsibilities by Union Ministers
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర కేబినెట్ లో మంత్రులుగా నియమితులైన వారు మంగళవారం తమ తమ మంత్రిత్వ శాఖల్లో బాధ్యతలను చేపట్టారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలను చేపట్టారు. జేపీ నడ్డా (ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, ఎరువులు, రసాయనాల) శాఖలో బాధ్యతలను చేపట్టారు. అశ్వినీ వైష్ణవ్ (రైల్వే సమాచార ప్రసార, ఐటీ అండ్ ఎలక్ర్టానిక్స్) మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. చిరాగ్ పాశ్వాన్ (ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల) శాఖ కారాయాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
బాధ్యతలు చేపట్టిన వారు. విదేశాంగ వ్యవహారా శాఖ బాధ్యతలను కేంద్రమంత్రి ఎస్.జైశంకర్ బాధ్యతలను చేపట్టారు.
కిరెన్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, సంజయ్ సేథ్ రక్షణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, ఎల్. మురుగన్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి, బాధ్యతలు స్వీకరించారు. అదే సమయంలో కేంద్ర మంత్రి సురేశ్ గోపీ పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ జితేంద్ర సింగ్ సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పర్యావరణ, అటవీశాఖ వాతావరణ శాఖ మంత్రిగా భూపేంద్ర యాదవ్ బాధ్యతలను చేపట్టారు. కీర్తి వర్ధన్ సింగ్ పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. గిరిరాజ్ సింగ్ జౌళి మంత్రిత్వ శాఖ బాధ్యతలను చేపట్టారు. పబిత్రా మార్గెరిటా జౌళి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. పీయూష్ గోయల్ వాణిజ్యం, పరిశ్రమల శాఖలో బాధ్యతలను చేపట్టారు. గిరిరాజ్ సింగ్ జౌళి మంత్రిత్వ శాఖగా బాధ్యతలు చేపట్టారు. అలాగే పబిత్రా మార్గెరిటా జౌళి శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ శాఖ, సురేశ్ గోపీ పెట్రోలియం, సహజవాయువు, టూరిజం మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. సాంస్కృతిక శాఖ మంత్రిగా గజేంద్ర సింగ్ షెకావత్ బాధ్యతలు స్వీకరించగా, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ లు కూడా తమ తమ బాధ్యతలను స్వీకరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా జితన్ రామ్ మాంఝీ కూడా పదవిని చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రులు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తమ తమ రంగాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామన్నారు.