రాహుల్​ భవిష్యత్​ అంధకారం

2026లోగా కాంగ్రెస్​ కనుమరుగు సీఎం హిమంత బిశ్వ శర్మ

Mar 26, 2024 - 18:04
 0
రాహుల్​ భవిష్యత్​ అంధకారం

డిస్ఫూర్: రాహుల్​ గాంధీ భవిష్యత్ అంధకారం కానుందని, 2026 నాటికి ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస పార్టీ కనుమరుగవుతుందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించారు. మంగళవారం రాజధాని డిస్ఫూర్​లో మీడియాతో మాట్లాడారు. చాలామంది కాంగ్రెస్​ పార్టీ పెద్ద, చిన్న నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడతారని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్​పార్టీ కనుమరుగయ్యేందుకు కారణమవుతుందన్నారు. లోక్​సభ ఎన్నికల అనంతరం పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమని శర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్​రాష్ట్ర అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా 2025లో బీజేపీలో చేరతారని శర్మ జోస్యం చెప్పుకొచ్చారు. టీఎంసీ నాయకులు కూడా తమతో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం అసోంలో మన ప్రభుత్వం అధికారంలో ఉందన్నారు. ఇది ఫిక్స్​డ్​ డిపాజిట్​ లాంటి ప్రభుత్వమని చమత్కరించారు. పార్టీకి అవసరమైనప్పుడు వారిని ఆహ్వానిస్తామని సీఎం బిశ్వ శర్మ తెలిపారు.