బీజేపీలోకి మరో జేఎంఎం నేత
Another JMM leader joins BJP
రాంచీ: ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ తోపాటు మరింత మంది నాయకులు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం జేఎంఎం మరో వ్యవస్థాపక నాయకుడు లోబిన్ హెంబ్రోమ్ బీజేపీలో చేరారు. ఈయన ను ఝార్ఖండ్ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల ఇన్ చార్జీ, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఝార్ఖండ్ లో గిరిజనుల ఉనికి కాపాడేందుకు చంపై నేతృత్వంలో ముందుకు నడుస్తానని అన్నారు. మోదీ నేతృత్వంలో బీజేపీలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో జేఎంఎం నుంచి బీజేపీలోకి భారీగానే చేరికలకు చంపై ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రయత్నాలు సత్ఫలితాలను సాధిస్తున్నాయి.