ఇరాన్​ లో హిజాబ్​ నిరసనలు

టెహ్రాన్​ యూనివర్సిటీలో విద్యార్థిని అర్థనగ్న నిరసన

Nov 3, 2024 - 14:43
 0
ఇరాన్​ లో హిజాబ్​ నిరసనలు

టెహ్రాన్: ఇరాన్‌లో హిజాబ్‌పై నిరసన మంటలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. టెహ్రాన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్ విద్యార్థి హిజాబ్ వేధింపులకు వ్యతిరేకంగా తన దుస్తులు విప్పి అర్థనగ్నంగా నిరసనను వ్యక్తం చేసింది. ఈమె ప్రదర్శనతో మరోమారు ఇరాన్​ లో విద్యార్థుల హక్కుల ఉల్లంఘనలపై ప్రపంచదేశాలను ఆలోచనలో పడవేశాయి. ఈ విషయాన్ని ఓ ఇరాన్​ రచయిత్రి తన సోషల్​ మాధ్యమంగా పంచుకోవడంతో విషయం ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకొచ్చింది. క్షణాల్లో ఈ వీడియో కాస్త వందలు, వేలు, లక్షలు, కోట్లలో వీక్షించడం గమనార్హం. ఈమె నిరసనపై సోషల్​ మాధ్యమంగా హర్షం వ్యక్తం అవుతుంది. స్ర్తీల జీవితాలతో ఇరాన్​ ప్రభుత్వం నిరంకుశ చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. 
2022లో పెద్ద యెత్తున ఇరాన్​ లో హిజాబ్​ కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో మహసా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో మృతి చెందడం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది. అనంతరం హిజాబ్​ లు తొలగించి ఇరాన్​ వ్యాప్తంగా మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. వీరికి పెద్ద యెత్తున పురుషులు కూడా మద్ధతు ప్రకటించారు. ఈ నిరసనలను ప్రభుత్వం అణచివేసింది. చాలామంది నిరసనకారులను ఉరి తీసింది.