అందెవెల్లి బ్రిడ్జి నిర్మాణంపై.. నిరవధిక నిరాహార దీక్ష

బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు

Jun 23, 2024 - 19:16
 0
అందెవెల్లి బ్రిడ్జి నిర్మాణంపై.. నిరవధిక నిరాహార దీక్ష

నా తెలంగాణ, సిర్పూర్​: అందెవెల్లి పెద్ద వాగు బ్రిడ్జి నిర్మాణం, అప్రోచ్​ రోడ్డు నిర్మాణంలో కాంగ్రెస్​ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని సిర్పూర్​ బీజేపీ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్​ బాబు ఆరోపించారు. సోమవారం ఉదయం నిరవధిక నిరాహార దీక్షకు కూర్చుంటానని పాల్వాయి హెచ్చరించారు. ఆదివారం పాల్వాయి లేఖ విడుదల చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్లే గతంలో  బ్రిడ్జి కూలిపోయిందన్నారు. కాంగ్రెస్​ మంత్రి సీతక్క కూడా ఈ బ్రిడ్జి నిర్మాణంపై పలుమార్లు మాట ఇచ్చారన్నారు. మొదలుపెట్టి ఏడాదవుతున్నా ఇంకా బ్రిడ్జి నిర్మాణం కాకపోవడం విచారకరమన్నారు. ఓట్లు దండుకునేందుకు వారు పర్యటన చేపట్టినట్లుగా పాల్వాయి ఆరోపించారు. కాంట్రాక్టర్లకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం కూడా మరో కారణమని తెలిపారు. 

ఎన్నిసార్లు మంత్రి సీతక్కకు ఈ విషయాన్ని వివరించినా పట్టించుకోలేదని,సమస్యను పరిష్​కరించడంలో పూర్తిగా విఫలమయ్యానని పేర్కొన్నారు. సోమవారం చేపట్టబోయే నిరాహార దీక్షకు చుట్టుపక్కల నుంచి బీజేపీ పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పాల్వాయి హరీష్​ పిలుపునిచ్చారు.