కల్తీ మద్యం మృతుల ఘటన మండిపడ్డ నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman was outraged by the incident of adulterated liquor deaths
చెన్నై: తమిళనాడు మద్యం దుర్ఘటనపై నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ఆదివారంనాటికి మృతుల సంఖ్య 56కు చేరింది. ఈ ఘటనపై మృతదేహాలను వెలికితీసి అక్రమమద్యం సేవించినట్లు నిర్ధారించి కుటుంబాలకు పరిహారం అందజేస్తామని జిల్లా యంత్రాంగం చెప్పడం సిగ్గుచేటని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆసుపత్రిలో ఇంకా 200మంది వరకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారన్నారు. మల్లిఖార్జున ఖర్గే ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. కనీసం మృతులకు నివాళులు కూడా అర్పించిన ఈ పార్టీ వ్యవహార శైలి ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు.