మొదలైన పాలిసెట్​ కౌన్సెలింగ్​

Polyset Counselling

Jun 23, 2024 - 20:17
 0
మొదలైన పాలిసెట్​ కౌన్సెలింగ్​

నా తెలంగాణ, హైదరాబాద్​: పాలిసెట్​ కౌన్సెలింగ్​ ప్రక్రియ మొదలైంది. ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్​ లో 5,760 అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫికేషన్​ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.  ఈ నెల 25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 27 వరకు ఆప్షన్లకు అవకాశం ఉంటుందని తెలిపారు. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కోరుకునే అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కోసం రాష్ట్రవ్యాప్తంగా 32 హెల్ప్‌లైన్‌ కేంద్రాలను  ఏర్పాటు చేసినట్టు విద్యాశాఖ తెలిపింది.