పోషకాహరం అందజేత

అందరికీ ఆహార భద్రతే భారత్​ ముఖ్యోద్దేశం అంతర్జాతీయ మిల్లెట్స్ ముగింపు వేడుకల్లో అదనపు కార్యదర్శి మణిందర్​ కౌర్​ ద్వివేది

Mar 30, 2024 - 17:23
 0
పోషకాహరం అందజేత

న్యూఢిల్లీ:  పోషకాహారాన్ని అందజేయడం, అందరికీ ఆహార భద్రత కల్పించడం భారతదేశం ముఖ్యోద్దేశమని ఇందులో భాగంగానే మిల్లెట్​లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్సవాల నిర్వహణను ప్రారంభించారని వ్వయసాయ, రైతు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి మణిందర్​ కౌర్​ ద్వివేది అన్నారు. శనివారం అంతర్జాతీయ మిల్లెట్స్​–2023 ముగింపు వేడుకలను ఇటలి రోమ్ ఎఫ్​ఏవో (ఫుడ్​ అండ్​ అగ్రికల్చరల్​ ఆర్గనైజేషన్) ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కార్యదర్శి కౌర్​ మాట్లాడుతూ నాణ్యమైన తృణధాన్యాలను అందించేందుకు భారత్​ అనేక చర్యలు చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా తృణధాన్యాలు పండిస్తున్న రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలను అందజేస్తున్నామన్నారు. వారికి తృణధాన్యాల పంటల సాగు, మార్కెటింగ్​ తదితరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫలితంగా మంచి దిగుబడిని భారత్​ సాధించగలుగుతుందని కౌర్​ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా యాయా అడిసా ఒలైటన్ ఒలనిరన్, ఎఫ్​ఏవో అధికారి బెత్ బెచ్‌డోల్ తదితరులు పాల్గొన్నారు.