జూన్​ 1వరకు ఎగ్జిట్​ పోల్స్​పై నిషేధం

ప్రకటన విడుదల చేసిన ఈసీ

Mar 30, 2024 - 17:25
 0
జూన్​ 1వరకు ఎగ్జిట్​ పోల్స్​పై నిషేధం

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికలకు తుది విడత పోలింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ప్రకటించడాని ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఏప్రిల్​ 19 న ఉదయం 7 గంటల నుంచి జూన్​ 1 రాత్రి 7.30 గంటల వరకు ఎగ్జిట్​ పోల్స్​పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్​ శనివారం ప్రకటించింది. ఈసీ ఆదేశాలను ధిక్కరిస్తే చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించింది. ఇప్పటికే మొదటి విడత నోటిఫికేషన్​ విడుదలైంది. ఎన్నికల కోడ్​ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదటి విడతలో లోక్​సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు కూడా వివిధ దశల్లో ఓటింగ్​ జరగనుంది. ప్రింట్ అండ్​ ఎలక్ట్రానిక్, సోషల్​ మీడియా ఏదైనా వేదికల ద్వారా గానీ ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం నడుకోవాలని ఈసీ స్పష్టం చేసింది.