ఈ–శ్రమ్​ లో 30.43 కోట్ల మంది నమోదు

అసంఘటిత కార్మికుల సంక్షేమమే లక్ష్యం కేంద్ర కార్మిక, ఉపాధి సహాయ మంత్రి శోభా కరంద్లాజే

Dec 6, 2024 - 16:39
 0
ఈ–శ్రమ్​ లో 30.43 కోట్ల మంది నమోదు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఈ–శ్రమ్​ పోర్టల్​ లో 2024 డిసెంబర్​ 1 నాటికి అసంఘటిత రంగ కార్మికులు 30.43 కోట్ల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే రాజ్యసభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.  గ్రామీణ ప్రాంతాల్లో 27.22 కోట్ల మంది అనధికారిక కార్మికులసంఖ్య ఉందన్నారు. 2021లో అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్​ డీయూడబ్ల్యూ జాతీయ డేటాబేస్​ పోర్టల్​ ఈ–శ్రమ్​ ను ప్రారంభించింది. కార్మికుల పరిధిని పెంచేందుకు మొబైల్​ ఫోన్​ లలో కూడా రిజిస్ర్టేషన్​ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఈ పోర్టల్​ లో కార్మికుల సంక్షేమానికి చెందిన 12 పథకాలను చేర్చారు. దీంతో కార్మికుల శ్రేయస్సు ఒకే వేదిక ద్వారా సులభతరం అవుతుంది. అసంఘటిత కార్మికులను వీలైనంత త్వరగా ఈ–శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేయాలని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మొదలైన ఇతర మంత్రిత్వ శాఖలకు విజ్ఞ్తప్తి చేసింది. ఈ పోర్టల్​ ద్వారా కార్మికుల సంక్షేమం, తప్పిపోయిన కార్మికులను గుర్తించడంలో కీలకం కానుంది.