వైద్యరంగంలో ఇద్దరికి నోబెల్
Nobel for two in the field of medicine
స్టాక్ హోమ్: 2024 నోబెల్ బహుమతి అమెరికాకు చెందిన ఇద్దరు శాస్ర్తవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గెర్రీ రువ్ కాన్ లకు లభించింది. స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో సోమవారం నుంచి నోబెల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ బహుమతిని ప్రకటించారు. బహుమతుల ప్రకటన వారంరోజులపాటు (అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 14) కొనసాగనుంది. వైద్యరంగంలో విక్టర్, గెర్రీలు ఫిజియాలజీ, మెడిసిన్ విభాగంలో విశేష కృషి చేసినందుకు నోబెల్ కు ఎంపిక చేసింది. జన్యు పరిణామ క్రమం (ఆర్ఎన్ఏ) పై ఎన్నోరకాల పరిశోధనలు చేసి విజయవంతమయ్యారు. 2024 వరకు 229 మందికి నోబెల్ బహుమతి లభించింది.