9ఏళ్లకే బాలికలకు వివాహం! ఇరాక్​ పార్లమెంట్​ లో బిల్లు

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యూనిసెఫ్​, హ్యూమన్​ రైట్స్​

Aug 9, 2024 - 15:22
 0
9ఏళ్లకే బాలికలకు వివాహం! ఇరాక్​ పార్లమెంట్​ లో బిల్లు

బాగ్ధాద్​: ఇరాక్​ పార్లమెంట్​ లో బాలికల వివాహ వయస్సు 18 ఏళ్ల నుంచి 9ఏళ్లకు తగ్గించాలనే బిల్లును ప్రవేశపెట్టారు. శుక్రవారం ఈ బిల్లును పార్లమెంట్​ లో ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. దీంతో ప్రపంచదేశాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఇరాక్​ లో బాలికల వివాహా వయస్సు 18యేళ్లు. ఈ బిల్లు ఆమోదం పొందితే బాలికలకు 9యేళ్లు, బాలురకు 15యేళ్లకే వివాహా వయస్సుకు ఆ దేశంలో అర్హత సాధించనున్నారు.

ఈ బిల్లు ద్వారా పిల్లలు, మహిళలు, లింగ సమానత్వం హక్కులు కాలరాసుకుపోతాయనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

ఈ బిల్లు వల్ల హక్కులు, గృహ హింసలు పెరుగుతాయని ఇది సమాజంలో, ప్రపంచదేశాల్లో తీవ్ర అలజడికి కారణం అవుతుందని యూనిసెఫ్​ ఆందోళన వ్యక్తం చశారు. బిల్లు ప్రవేశపెట్టడం పట్ల అంతర్జాతీయ హ్యూమన్​ రైట్స్​ ప్రధానాధికారి సారా సంబర్​ మాట్లాడుతూ.. ఇది తీవ్ర విచారకరమని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుకు ఆమోదం పొందినా తాము అంతర్జాతీయ కోర్టులో ఈ అంశాన్ని లేవనెత్తి పిల్లలు, మహిళల హక్కులను కాపాడతామని, కేసు వేస్తామని హెచ్చరించారు.