ఏడోదశ ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల

14 వరకు నామినేషన్​ జూన్​ 1న ఎన్నికలు ఏడు రాష్ట్రాలు, 57 స్థానాలకు పోలింగ్

May 8, 2024 - 12:52
 0
ఏడోదశ ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల

నా తెలంగాణ, న్యూఢిల్లీ: లోక్​ సభ ఏడో దశ ఎన్నికలకు బుధవారం ఈసీ (ఎలక్షన్​ కమిషన్​) నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ లో పేర్కొన్నారు. 

మే 14 వరకు నామినేషన్లు దాఖలకు గడువు ఇవ్వగా 15వ తేదీన నామినేషన్ల పరిశీలన, 17న ఉపసంహరణ తేదీలుగా ప్రకటించింది. జూన్​ 1వ తేదీన ఓటింగ్​ జరగనున్న విషయం తెలిసిందే. కాగా ఏడో దశలో చండీగఢ్‌లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్‌ 9, ఉత్తరప్రదేశ్‌‌ 13, పంజాబ్‌ 13 , బీహార్‌ ఎనిమిది, ఒడిశా ఆరు, హిమాచల్‌ ప్రదేశ్‌ నాలుగు, ఝార్ఖండ్‌‌లో మూడు స్థానాలకు చివరి దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి స్థానానికి కూడా చివరి దశలోనే పోలింగ్​ జరగనుండడం విశేషం.