నితీశ్ ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర
ఈడీ విచారణలో హవాలా రాకెట్ గుట్టు
పాట్నా: బిహార్ నితీశ్ కుమార్ ను పడగొట్టేందుకు జరిగిన కుట్ర విషయం ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్) విచారణలో బయటికి వచ్చింది. సోమవారం ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. 2019లో నితీశ్ కుమార్ ఇండికూటమిని వీడి బీజేపీలో చేరేందుకు సమాయత్తం కాగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున హావాలా మార్గం ద్వారా డబ్బులు పంపినట్లు గుర్తించామని తెలిపారు. ఈ లావాదేవీలు అనుమానాస్పదంగా ఉండడంతో కూపీ లాగితే పూర్తి విషయాలు బయటికి వచ్చాయన్నారు. ఢిల్లీ, యూపీ, ఝార్ఖండ్, నేపాల్ ల నుంచి నితీశ్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. నితీశ్ ప్రభుత్వం విశ్వాస పరీక్షలు విఫలమయ్యేందుకు కూడా ప్రయత్నించారని తెలిపారు. ఒకవేళ నితీశ్ ఒడిపోయి ఉంటే హావాలా ద్వారా భారీ మొత్తంలో పలువురికి నగదు అంది ఉండేదేమో? అని అన్నారు.
ఈ విషయంపై ఇప్పటికే పాట్నాలోని కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైందని తెలిపారు. ఈ కేసు ఆధారంగానే దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగుకొచ్చాని ఈడీ అధికారులు తెలిపారు.