విభవ్​ కు బిగుస్తున్న ఉచ్చు డేటా తొలగింపు.. విచారణ

ముంబైకు తీసుకువెళ్లిన విచారణ బృందాలు నేరం బయటపడుతుందనే డేటా తొలగింపు బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ మండిపాటు

May 21, 2024 - 17:32
 0
విభవ్​ కు బిగుస్తున్న ఉచ్చు డేటా తొలగింపు.. విచారణ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: స్వాతిమాలివాల్​ పై కేసులో విభవ్​ కుమార్​ కు ఉచ్చు బిగుస్తోంది. మంగళవారం ఢిల్లీ ప్రత్యేక విచారణ బృందాలు విభవ్​ ను ముంబై తీసుకువెళ్లాయి. సీసీ ఫుటేజీలు, పెన్​ డ్రైవ్​ లు, సెల్​ ఫోన్లలోని డేటాను ముంబైలోనే తొలగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విభవ్​ ను మహారాష్ర్ట తీసుకువెళుతున్నట్లు తెలుస్తోంది. తీస్​ హాజరీ కోర్టు నుంచి ప్రత్యేక అనుమతిని తీసుకున్న పోలీసులు విచారణలో దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఫోన ఫార్మెట్​ చేసిన ప్రదేశాన్ని పోలీసులు కనుగొన్నారు. విభవ్​ విచారణలో కూడా ఈ విషయం స్పష్టమైంది. అందుకే అతన్ని ముంబై తీసుకువెళ్లి తొలగించిన డేటాను తిరిగి సేకరించే పనిలో పడ్డారు. 

ఈ విషయంపై బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ మాట్లాడుతూ.. నేరం చేయడం విచారణలో పట్టుబడతామన్న భయంతో ఫుటేజీల్లో, ఫోన్లలో ఉన్న డేటాను తొలగించడం మాములైపోయిందన్నారు. కానీ విచారణలో అన్ని విషయాలు తేలుతాయన్న ఇంగిత జ్ఞానం కూడా ఆయా నాయకుల్లో లేకుండా పోతోందని మండిపడ్డారు. డేటా తొలగించినంత మాత్రాన తమ సచ్ఛీలతను ఏ విధంగా నిరూపించుకుంటారని ప్రశ్నించారు. కేజ్రీవాల్​ మద్యం కుంభకోణంలో కూడా డేటాను తొలగించారని ఇల్మీ గుర్తు చేశారు. ఏది ఏమైనా స్వాతిమాలివాల్​ పై దాడి లో చాలా విషయాలు బయటకు రానున్నాయని ఇల్మీ పేర్కొన్నారు.