బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు
రాయబార కార్యాలయాల ఉద్యోగులు వెనక్కు రెండు ప్రత్యేక విమానాల్లో 400మంది భారతీయుల రాక
ఢాకా: బంగ్లాదేశ్ లో హిందువులు, ఆలయాలు, ఆస్తులపై వరుస దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా పలు చోట్ల చెలరేగిన హింసలో హిందువుల ఇళ్లనే ఆందోళనకారులు టార్గెట్ గా చేసుకుంటున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయ ఉద్యోగులను భారత్ వెనక్కి రావాలని ఆదేశించింది. బుధవారం ఉదయం 400మందికిపైగా భారతీయులను రెండు విమానాల ద్వారా వెనక్కి తీసుకొచ్చారు.
రోజురోజుకు పరిస్థితులు చేయి దాటుతుండడంతో ఏం చేయాలన్న విషయమై భారత ప్రభుత్వం సునిశితమైన నిర్ణయాలు తీసుకుంటుంది.
రాయబార కార్యాలయాల్లో కేవలం దౌత్యవేత్తలు మాత్రమే కార్యాలయాల్లో ఉండనున్నారు. మిగతా సిబ్బంది అందరూ వెనక్కి తిరిగి రానున్నారు.
మరోవైపు బంగ్లాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు బుధవారం నుంచి ఢాకాకు రెండు ఏయిర్ ఇండియా విమానాలను నడపనుంది. ఈ విమానాలను కోల్ కతా నుంచి ఢాకాకు నడపనున్నట్లు స్పష్టం చేసింది.
మరోవైపు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్ లో ఉండడం కూడా ఆమె వ్యతిరేకులకు రుచించడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం బంగ్లాలో జరిగిన ఆర్మీ న్యాయమూర్తుల సమావేశంలో ఆమెను అరెస్టు చేసి బంగ్లాకు అప్పగించాలని భారత్ ను కోరారు. ఇంకోవైపు బ్రిటలో కూడా హసీనా ఉండేందుకు అనుమతి లభించలేదు.