బ్రిక్స్​ లో చతుర్ముఖ వ్యూహం పాక్​ చేరికకు నో

No to Pakistan's four-pronged strategy in BRICS

Oct 24, 2024 - 12:59
 0
బ్రిక్స్​ లో చతుర్ముఖ వ్యూహం పాక్​ చేరికకు నో
మోదీ స్ర్టాటజీతో పాక్​ కు చుక్కలు
ఆసియా అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ఎదగనున్న భారత్​–చైనాలు
ఎస్​ సీవోలోనే స్పష్టం చేసిన మంత్రి జై శంకర్​
ఆశలు అడియాశలతో నీరసపడ్డ పాక్​ 
నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​:  పాక్​ కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. బ్రిక్స్​ లో చేరాలనుకున్న పాక్​ ఆశలు ఆవిరయ్యాయి. ప్రపంచదేశాల్లో పాక్​ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని, దాని పరిణామాలను స్వయంగా చూస్తున్న సొంత ఇస్లామిక్​ దేశాలు కూడా పాక్​ బ్రిక్స్​ లో చేరికపై అనాసక్తిని ప్రదర్శించాయి. కనీసం పాక్​ పెట్టుకున్న దరఖాస్తును కూడా బ్రిక్స్​ దేశాల్లో చేరాలనుకున్న దేశాల దరఖాస్తుల నుంచి పక్కన పడేశాయి. 
 
భారత్​ పై విషం గక్కుతారా?..
ఒక విధంగా చెప్పాలంటే బ్రిక్స్​ లో చేరి ఆర్థిక కష్టాల్లోంచి గట్టెక్కాలనుకున్న పాక్​ ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో పాక్​ చతుర్ముఖ వ్యూహంతో వెళ్లి అడ్డుకుంది. రష్యా, చైనా, భారత్​, బ్రిక్స్​ లో చేరాలనుకుంటున్న మరో 29 దేశాలతో జతకట్టి చతుర్ముఖ వ్యూహాన్ని అమలు చేసింది. చీటికి మాటికీ భారత సంస్కృతి, సాంప్రదాయాలపై విషం గక్కుతున్న పాక్​ పై భారత్​ ధీటుగా సమాధానం ఇస్తూ ఓ వైపు చావు కబురు చల్లగా అందిస్తూనే మరో వైపు మోదీ నేతృత్వంలో విదేశాంగ శాఖ తన బలమైన స్ర్టాటజీని అనుసరిస్తూ పాక్​ బ్రిక్స్​ లో చేరడాన్ని అడ్డుకోవడంలో సఫలమైంది. 
 
కారిడార్​ నిర్మాణం పేరిట చైనాకు ద్రోహం..
అంతర్జాతీయ ఉగ్రవాదులను సైతం తమ సొంతదేశంలోనే ఆశ్రయం కల్పిస్తూ ఇతర దేశాలపై నెపం నెడుతున్న పాక్​ విధానాలను యూఎన్ కూడా పలుమార్లు హెచ్చరికలు, మొట్టికాయలు వేసింది. అయినా పాక్​ లో మార్పు రాలేదు. ప్రస్తుతం చైనాతో పాక్​ ఆక్రమిత కాశ్మీర్​ మీదుగా కారిడార్​ కు ఒప్పందం చేసుకొని తీసుకోవాల్సినంత తీసుకొని ఆ దేశ ప్రజలకు, కాంట్రాక్టర్లకు, పనులు చేస్తున్న ఇంజనీర్లకే భద్రత కల్పించలేక చేతులెత్తేస్తోంది.
 
పాక్​, అమెరికా దుర్నీతికి బ్రిక్స్​ లో చైనా చెక్​..
కరోనాతో కష్టకాలంలో ఉన్న చైనా కూడా తమదేశ ప్రయోజనాల కోసం భారత్​ తో కొంతకాలంపాటూ విబేధించినా పాక్​, అమెరికాల దుర్భుద్ధి, దుర్నీతి జిన్ పింగ్​ కు ​అర్థం అయింది. పాక్​ తో కలిసి వెళితే తమ దేశ ప్రయోజనాలకు భంగమే తప్ప ఇతర ప్రయోజనాలు లేవని గుర్తించింది. దీంతో భారత్​ తో లడఖ్​ సరిహద్దుపై శాంతికి ఒప్పందం కుదుర్చుకుంది. ఐదేళ్ల తరువాత ఆసియాలోనే అతిపెద్ద దేశాలైన భారత–చైనాలు రష్యా సహాయంతో చేతులు కలపడంలో ఆర్థికంగా ఉన్నత దేశాల్లో కూడా దడ పుట్టిస్తోంది. 
 
ఎస్​ సీవోలో చురకలంటించిన మంత్రి జై శంకర్​..
జై శంకర్​ ఇటీవల పాక్​ ఎస్​ సీవో (షాంఘై కో–ఆపరేషన్​ సదస్సు)కు వెళ్లినా భారత్​ విధానంలో మార్పు లేదని కుండబద్దలు కొట్టారు. ముందుగా ఉగ్రవాదాన్ని వీడాలని, భారత్​ తో చీటికీ మాటికీ విబేధించడం మానాలని చురకలంటించి వచ్చారు. ఈ వార్త బయటకు రాకపోయినా అక్కడ అదే జరిగినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్​ కు అప్పుడే అర్థం అయింది. బ్రిక్స్​ లో తమకు భంగపాటు తప్పదని. అనుకున్న సమయం వచ్చినా పాక్​ బ్రిక్స్​ లో చేరికకు భారత్​ మొత్తానికి చతుర్ముఖ వ్యూహంతో ముందుకువెళ్లింది.