హరియాణా బీజేపీ రెండో లిస్ట్​ జారీ

Haryana BJP second list issued

Sep 10, 2024 - 18:57
 0
హరియాణా బీజేపీ రెండో లిస్ట్​ జారీ

చండీగఢ్​: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే రెండో అభ్యర్థుల లిస్టును బీజేపీ పార్టీ మంగళవారం జారీ చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్​ మనవరాలు శృతి చౌదరి, కేంద్రమంత్రి రావు ఇంద్రజిత్​ సింగ్​ కుమార్తె ఆర్తీ సింగ్​ రావులకు చోటు కల్పించింది. సీఎం నాయాబ్​ సింగ్​ సైనీని లాడ్వా నుంచి పోటీకి దింపింది. ఝులానా నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి వినేష్​ ఫోగట్​ (రెజ్లర్​)పై ప్రత్యర్థిగా కెప్టెన్​ యోగేష్​ బైరాగిని ప్రకటించింది. తొలిజాబితా సెప్టెంబర్​ 4న 67మంది పేర్లను బీజేపీ ప్రకటించింది. రెండో జాబితాలో 21మందికి చోటు కల్పించింది. దీంతో 90 స్థానాలకు గాను 88మంది పేర్లను బీజేపీ ప్రకటించినట్లయ్యింది.