ఐపీఎస్​ కుట్టేపై ఈసీ సస్పెన్షన్​ వేటు

ఈవీఎం ధ్వంసంపై ఖుర్దా ఎమ్మెల్యేను విచారించాలని రాష్ర్ట ఎన్నికల కమిషనర్​ కు ఆదేశాలు

May 29, 2024 - 14:37
 0
ఐపీఎస్​ కుట్టేపై ఈసీ సస్పెన్షన్​ వేటు

భువనేశ్వర్​: ఒడిశా సీఎం ప్రత్యేక కార్యదర్శి ఐపీఎస్​ అధికారి డీఎస్​ కుట్టేను ఈసీ (ఎలక్షన్​ కమిషన్​) విధుల నుంచి తప్పించింది. వెంటనే అతన్ని బుధవారం ఈసీ ముందు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో ఐపీఎస్​ ఆశిష్​ కుమార్​ ను రాష్ర్ట ఈసీ ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకొని ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈసీ ముందు హాజరు పరిచేందుకు ఢిల్లీ తీసుకువెళ్లారు. ఖుర్దా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్​ జగదేవ్​ పై విచారణ కొనసాగించాలని ఈసీ రాష్ర్ట ఎన్నికల కమిషన్​ ను ఆదేశించింది. ఎమ్మెల్యేపై ఈవీఎం ధ్వంసం ఆరోపణలున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు కుట్టేపై చార్జిషీటు ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ నిబంధనలు, షరతుల ప్రకారం మే 30లోగా డీఎస్‌ కుట్టేపై అవసరమైన చార్జిషీట్‌ను సిద్ధం చేయాలని కూడా చీఫ్‌ సెక్రటరీని ఈసీ ఆదేశించారు.